Thu Jan 29 2026 04:12:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ మెట్టుగూడలో రైలు ప్రమాదం.. ఏసీ బోగీల్లో మంటలు
హైదరాబాద్ మెట్టుగూడలో రైలు ప్రమాదం జరిగింది. ఏసీబోగీల్లో మంటలు వ్యాపించాయి

హైదరాబాద్ మెట్టుగూడలో రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బ్రడ్జి కింద వెళుతున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు ఏసీ బోగీల నుంచి మంటలు ఎగసి పడటంతో వెంటనే రైలును నిలిపేశారు. అయితే ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
వెంటనే అదుపులోకి తెచ్చి...
మెట్టుగూడ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. రెండు ఏసీ బోగీల నుంచి మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు రైలును నిలిపేశారు. మెట్టు గూడ బ్రిడ్జి కింద వెళుతున్న వాహనదారులు భయపడి అక్కడి నుంచి తప్పుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే స్పందించిన అధికారుల మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయం కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేరని తెలిసింది.
Next Story

