Mon Mar 23 2026 02:50:03 GMT+0530 (India Standard Time)
కొత్త ఏడాది ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లో కొత్త సంవత్సరం రోజున విషాదం నెలకొంది. ఉదయం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు

హైదరాబాద్ లో కొత్త సంవత్సరం రోజున విషాదం నెలకొంది. ఉదయం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 3లో ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొట్టడంతో అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఇద్దరు మృతి...
కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమా? లేక మద్యం తాగి కారు నడిపినందున ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొత్త ఏడాది హైదరాబాద్ లో విషాదం నింపింది.
Next Story

