Fri Feb 14 2025 11:53:30 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎల్బీనగర్ లో విషాదం.. మట్టిదిబ్బలు పడి ముగ్గురు మృతి
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం జరిగింది. ఒక సెల్లార్ తవ్వకాలు జరుగుతుండగా మట్టి దిబ్బలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం జరిగింది. ఒక సెల్లార్ తవ్వకాలు జరుగుతుండగా మట్టి దిబ్బలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణం కోసం పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ముగ్గురు కార్మికులు మట్టి దిబ్బల కింద చిక్కుకుని పోయి మరణించడంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సెల్లార్ తవ్వుతుండగా...
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఒక మృతదేహం వెలికి తీశారు. మరో రెండు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. అయితే మృతులు ముగ్గురూ బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే సెల్లార్ తవ్వకం సమయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడ వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story