Thu Mar 19 2026 07:03:14 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిది
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళుర్పిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకూ గన్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
మూడు ప్రాంతాల్లో...
అలాగే 9 గంటల నుంచి పది గంటల వరకూ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నందున ట్యాంక్ బండ్ పై రాత్రి పన్నెండు గంటల వరకూ వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.
Next Story

