Thu Mar 19 2026 07:03:59 GMT+0530 (India Standard Time)
Hyderabad : నేడు, రేపు అటు వైపు వెళితే ట్రాఫిక్ లో చిక్కుకుంటారు.. ఆంక్షలున్నాయ్
టి నుంచి ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తుంది. సోనియా గాంధీ ముఖ్య అతిధిగా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ట్యాంక్ బండ్ , పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి ట్యాంక్ బండ్ పై...
దీంతో నేటి నుంచి ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈరోజు ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఆదివారం రాత్రి పన్నెండు గంటల వరకూ ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలపై నిషేధాన్ని విధించారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో ఎవరినీ రానివ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు ఈ రూట్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసుల తెలిపారు.
Next Story

