Thu Apr 02 2026 15:23:04 GMT+0530 (India Standard Time)
వాహనదారులూ మూడు రోజులు అటు వెళ్లొద్దు
ఈ నెల 9వ తేదీ నుంచి 11 వతేదీ వరకూ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ఈ నెల 9వ తేదీ నుంచి 11 వతేదీ వరకూ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇండియన్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రేసింగ్ ముగిసే వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు గమనించి ఇటువైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇండియన్ రేసింగ్...
ఖైరతాబాద్ నుంచి ఐమాక్స్ వరకూ, తెలుగుతల్లి కూడలి వైపు వెళ్లే మార్గాలన్నీ ఈ మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. ఎటువంటి వాహనాలను అనుమతించరు. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న ఈ-ఫార్ములా పోటీలకు సన్నాహకంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇండియన్ రేసింగ్ ను ఇటీవల నిర్వహించినా కొన్ని కారణాలతో అర్థాంతరంగా ముగిశాయి. దీంతో ఎల్లుండి నుంచి మరలా రేసింగ్ నిర్వహిస్తున్నందున వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు.
Next Story

