Mon Jan 26 2026 03:48:09 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదారాబాద్ లో ఈరోజు ఈ రూట్లో వెళ్లేవారికి అలెర్ట్
హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. రేపు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళల్లో అటు వైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోవాలని పోలీసులు తెలిపారు.
ఈ రూట్లలో ట్రాఫిక్...
వీవీఐపీలు ఈ మార్గాన వస్తుండటంతో అటు వెళ్లేవారు మాత్రం ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లాలని సూచించారు. ఎక్కడకక్కడ బ్యారికేడ్లను నిర్మించడంతో వాహనాలను పోలీసులు నిలిపేయనున్నారు. ప్రధానంగా టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డు మధ్య రహదారిని మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్లాజా, సీటీవోలో, బ్రూక్ బాండ్ , టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డు మధ్య రహదారిని పూర్తిగా మూసివేయనున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మెట్రో సేవలను వినియోగించుకోవడం...
సంగీత్ ఎక్స్ రోడ్స్ తో పాటు వైఎంసీఏ, ప్యాట్నీ, ప్యారడైజ్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్ బండ్, బాలమ్రాయ్, రసూలప్ పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఇటువైపు వెళ్లే వారు, వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం మంచిదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. జూబ్లీబస్ స్టేషన్ కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు మాత్రం ముందుగానే బయలుదేరడం మంచిదని సూచించారు. అయితే ఈ మార్గంలో ఆఫీసులకు, బస్టాండ్, రైల్వేస్టేషన్ కు వెళ్లేవారు మెట్రో రైళ్లను వినియోగించుకోవాలని కోరారు. బేగంపేట, కార్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, టివోలి, బోయినపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాల నుంచి వెళ్లేలే చూశారు. అత్యవసరమైతే 8712662999 కు ఫోన్ చేయవచ్చు.
Next Story

