Fri Feb 14 2025 19:09:46 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ట్రాఫిక్ పల్స్ తో సమస్యకు చెక్
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. దీనికి సైబరాబాద్ పోలీసులు విరుగుడు కనిపెట్టారు

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. దీనికి సైబరాబాద్ పోలీసులు విరుగుడు కనిపెట్టారు. ట్రాఫిక్ పల్స్ నే యాప్ ను రూపొందించారు. హైదరాబాద్ లో వారంతోనూ, సమయంతోనూ సంబంధం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. గంటల సేపు వాహనాల్లోనే ఉండి పోవాల్సి వస్తుంది.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా...
అందుకోసమ వీటికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ పల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలను గుర్తించి వాహనదారులకు సమాచారం అందిస్తుంది. వెంటనే వాహనదారులు ప్రత్యామ్నాయ మర్గాల ద్వారా వెళ్లేందుకు అవకాశముంటుంది. ట్రాఫిక్ అప్ డేట్ తెలిస్తే అందుకు అనుగుణంగా ప్రయాణికులు తమ దిశను మార్చుకునే వీలుంటుంది. ఈ విధానం వల్ల ఎంత వరకూ ప్రయోజనం అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.
Next Story