Tue Feb 24 2026 15:51:59 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు మీడియా ఎదుటకు మావోయిస్టు అగ్ర నేతలు
తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలున్నారు

తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలున్నారు. నేడు మీడియా ముందుకు మావోయిస్టు అగ్ర నేతలను పోలీసులు హాజరు పర్చే అవకాశాలున్నాయి. తెలంగాణ పోలీసుల ఎదుట కీలకమైన మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. ఇందులో దేవ్ జీ అలియాస్ తిప్పర్తి తిరుపతి మల్లా రాజిరెడ్డి చొక్కా రావు, దామోదర్ నూనె నర్సింహారెడ్డి వీరితోపాటు మరో 15 మంది తెలంగాణ డిజిపి శివ రెడ్డి ఎదుట లొంగిపోయారకని తెలిపారు.
అధికారిక ప్రకటన...
ఈరోజు జరిగే మీడియా సమావేశంలో తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆపరేషన్ కగార్ సమయం గడువు ముగుస్తున్న సమయంలో తెలంగాణలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఎన్ కౌంటర్ లో మరణించగా, మరికొందరు లొంగిపోయారని తెలిపారు.
Next Story

