Sat Mar 07 2026 18:58:20 GMT+0530 (India Standard Time)
Breaking : కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు బెయిల్
కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది.

కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడులు, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలులో ఉన్నారు. ఆయన అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా న్యాయస్థానం బెయిల్ లభించడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోక్సో కేసును...
జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆయన రెండు వారాల నుంచి జైలులోనే ఉన్నారు. ఆయనకు మధ్యలో కొద్దికాలం మధ్యంతర బెయిల్ లభించింది. అయితే జాతీయ అవార్డు అందుకోసమే ఈ బెయిల్ ను మంజూరు చేసింది. ఇప్పుడు బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి ఈరోజు సాయంత్రం బయటకు వచ్చే అవకాశముంది.
Next Story

