Fri Dec 05 2025 13:53:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్లో జీరో షాడో
నేడు హైదరాబాద్లో నీడ మాయమయిపోతుంది. జీరో షాడో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

నేడు హైదరాబాద్లో నీడ మాయమయిపోతుంది. జీరో షాడో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. సరిగ్గా మధ్యాహ్నం 12.12 గంటలకు నీడ కనిపించకుండా పోతుంది. ఇటీవల బెంగళూరులో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమయింది. ఈ ఏడాది మే 9వ తేదీ, ఆగస్టు 3వ తేదీన ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
బిర్లా ప్లానిటోరియంలో...
జీరో షాడో పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేశారు. వేలాది మంది విద్యార్థులకు ఆహ్వానం పంపారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా నీడ మాయం కావడంపై అవగాహన ఏర్పరచుకునేందుకు బిర్లా ప్లానిటోరియంకు తరలి వస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

