Sun Mar 15 2026 15:00:44 GMT+0530 (India Standard Time)
నేడు సికింద్రాబాద్ లష్కర్ బోనాలు
నేడు సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాలు జరుగుతున్నాయి

నేడు సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. ఉదయం 8గంటలకు మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
సికింద్రాబాద్ మహంకాళీ బోనాల కోసం ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చేశారు.శివసత్తులకు ప్రత్యేక లైన్ ఏర్పాటును అధికారులు చేశారు. . రేపు రంగం భవిష్యవాణి, అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది. లష్కర్ బోనాలు సందర్భంగా నేడు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Next Story

