Fri Dec 19 2025 06:12:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ
నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ

నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ సాగుతుంది. మొత్తం పన్నెండు రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారణకు నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. నిన్నటి నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు నేడు రెండో రోజు కూడా విచారించనున్నారు. ఐ బొమ్మ రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసలు విచారించనున్నారు.
అనేక అంశాలపై...
పైరసీ సినిమాలతో పాటు విదేశాల్లో ఆయన బ్యాంకు లావాదేవీలు, కరేబియన్ దీవుల్లో కార్యాలయం సిబ్బంది వివరాలతో పాటు విదేశీ నగదును ఏఏ బ్యాంకుల్లో దాచి పెట్టారన్న దానిపై కూడా నేడు పోలీసుల ఐ బొమ్మ రవిని విచారించే అవకాశముంది. దాదాపు పన్నెండు కేసులకు పైగానే ఐబొమ్మ రవిపై నమోదయన నేపథ్యంలో ఈసారి కస్టడీలో విచారణ కీలంగా మారనుంది.
Next Story

