Thu Mar 19 2026 17:03:03 GMT+0530 (India Standard Time)
ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత.. అసోం సీఎంను..?
గణేష్ నిమజ్జనం సందర్భంగా మొజంజాహి మార్కెట్ వద్ద కొంత ఉద్రిక్తత తలెత్తింది

గణేష్ నిమజ్జనం సందర్భంగా మొజంజాహి మార్కెగట్ వద్ద కొంత ఉద్రిక్తత తలెత్తింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వంత శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో సభావేదికపైకి ఎక్కిన నందుబిలాల్ అసోం సీఎం నుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసులు జోక్యం చేసుకుని....
వెంటనే టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలకు సంస్కారం లేదని, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను అడ్డుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. దీనిని సాహసోపేతమైన చర్యగా టీఆర్ఎస్ భావిస్తుండవచ్చని, కానీ పిరికిపందలు చేసే చర్య అని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం దురదృష్టకరమని ఈటల రాజేందర్ అన్నారు.
Next Story

