Sat Mar 07 2026 18:41:57 GMT+0530 (India Standard Time)
విద్యార్థినిపై అత్యాచారం... యువకుడి దారుణం
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఒక యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఒక యువకుడు. రాజేంద్ర నగర్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని తన మాటలతో లోబర్చుకుని హిమాయత్ సాగర్ కు తీసుకెళ్లాడు యువకుడు. తన బైక్ పై విద్యార్థిని తీసుకెళ్లిన ఆ యువకుడు అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
తల్లి అడగటంతో....
అత్యాచారం చేసిన తర్వాత విద్యార్థినిని ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి గట్టిగా అడగడంతో ఆ విద్యార్థిని అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

