Sun Feb 01 2026 16:46:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫార్మా కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్
సంగారెడ్డి జిల్లా లియో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో మంటలు వ్యాపించాయి

సంగారెడ్డి జిల్లా లియో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకుని పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఇద్దరు కార్మికులకు...
ఇద్దరు కార్మికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మంటల్లో ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా? అన్న దానిపై అధికారులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

