Fri Dec 05 2025 12:45:25 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో భూములు ఇక కొనలేరా? చదరపు గజం ఇంత రేటా?
హైదరాబాద్ లో భూముల ధరలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. నగరం ఎంతగా పెరుగుతున్నప్పటికీ భూముల ధరలు మాత్రం ఆకాశం వైపు చూస్తుంటాయి

హైదరాబాద్ లో భూముల ధరలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. నగరం ఎంతగా పెరుగుతున్నప్పటికీ భూముల ధరలు మాత్రం ఆకాశం వైపు చూస్తుంటాయి. అందులోనూ హైటెక్ సిటీ వద్ద భూముల ధరల విషయం ఇక చెప్పాల్సిన పనిలేదు. వీటిని కొనుగోలు చేయాలంటే కాసులు పుష్కలంగా అవసరం. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు సాధ్యం కాని రీతిలో ధరలు పెరుగుతుంటాయి. ఉన్నత స్థాయి వర్గాలకు మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. అందుకే హైదరాబాద్ లో గజం భూమి ధర లక్షల్లో పలుకుతుంది. ఎక్కువ మంది హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సాహం చూపడం వల్లనే భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నది వాస్తవం.
కోకాపేటలో భూమి ధర...
తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన స్థలాల వేలంలో రికార్డు స్థాయిలో గజం ధరకు చేరుకుంది. అంతేకాదు హెచ్ఎండీఏ ఈ ధరలను కనీస ధరలుగా నిర్ణయించడంతో భూముల ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం కోకాపేట ప్రాంతం కనకవర్షం కురిపిస్తుంది. హెచ్ఎండీఏ విడుదల చేసిన నోటిఫికేషన్ లో చదరపు గజం 1.75 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ ప్రాంతంలో భూమి గతంలో అరవై ఐదు వేల రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ భూమి ఐదారు రెట్లు పెరిగిందంటే భూముల విలువ ఎంతగా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ భూమిలోని సర్వే నెంబరు 144లో 8,591 చదరపు గజాల భూమిని 150 కోట్లగా ప్రభుత్వం నిర్ణయించింది.
శివారు ప్రాంతంలో కూడా...
అయితే ఈ భూమి ధర ఇక వేలంలో ఎంత పోతుందన్నది చూడాల్సి ఉంది. కోకాపేట మాత్రమే కాదు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేయగలిగినంత రేంజ్ కు వెళ్లిపోయాయి. వాళ్లు ఆ భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేసి అమ్మితేనే అదీ ధరలు అందుబాటులో ఉంటేనే కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఎటు చూసినా భూముల ధరలు పెరగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అసలు భూమి కూడా లేదు. అందుకే హైదరాబాద్ లో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా అది బంగారం కంటే మించి పోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

