Fri Dec 05 2025 12:00:52 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మెట్రో రైలు ఛార్జీలు మరింత పెరగనున్నాయా?
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులపై త్వరలో ఛార్జీల భారం పడే అవకాశాలున్నాయి.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులపై త్వరలో ఛార్జీల భారం పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎల్ అండ్ టి సంస్థ కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంచాలని మెట్రో రైలు డెవలెప్ మెంట్ కార్పొరేషన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే విపరీతంగా రద్దీ పెరగడంతో పాటు వేళల సమయాన్ని కూడా పొడిగించడంతో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్ లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తమకు లాభాలు రావడం లేదని ఎల్ అండ్ టి సంస్థ పేర్కొంది. హైదరాబాద్ మెట్రో కారణంగా దాదాపు ఆరువేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ వెల్లడిచించింది.
నష్టాల్లో ఉన్నందున...
కరోనా సమయంలో ఎక్కువ నష్టపోయిన తమ సంస్థ మెట్రో ఛార్జీలను పెంచుతామని గత ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ఛార్జీల పెంపుదలకు అంగీకరించలేదు. దీంతో ఛార్జీల పెంపుదలను వాయిదా వేసుకుంది. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మేరకు ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదనలను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో 44 శాతం మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలన్నది ఎల్ అండ్ మెట్రో సంస్థ లెక్కలు వేసుకుంటుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇప్పటికే 59 రూపాయల హాలిడే సేవర్ కార్డు రద్దు చేసింది. మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో పదిశాతం డిస్కౌంట్ ఎత్తివేసింది.
Next Story

