తిరుపతి వెళ్లే విమానం టెన్షన్ పెట్టింది
శంషాబాద్ నుంచి తిరుపతికి జూన్ 15 రాత్రి వెళ్లాల్సిన ఓ విమాన సర్వీస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

శంషాబాద్ నుంచి తిరుపతికి జూన్ 15 రాత్రి వెళ్లాల్సిన ఓ విమాన సర్వీస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. స్పైస్‌జెట్ ఎస్జీ-2138 విమాన సర్వీస్ రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ నుంచి తిరుపతికి టేకాఫ్ కావాల్సి ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి గంట ఆలస్యంగా చేరుకున్న విమానం రాత్రి 8.30 గంటలకు 65 మందితో తిరుపతికి బయల్దేరడానికి రన్‌వే వైపు కదిలింది.
ఇంతలోనే ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని ఇంజినీరింగ్ నిపుణులు సరిచేశారు. కానీ ఇంజిన్ స్టార్ట్ చేయగానే వాసన రావడంతో విమానాన్ని పైలట్ నిలిపివేశారు. విమానం టేకాఫ్ కోసం సుమారు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాసిన ప్రయాణికులను మూడుసార్లు విమానంలోకి ఎక్కించి కిందకు దించారు. ఎట్టకేలకు రాత్రి 10.54 గంటలకు విమానం తిరుపతికి బయల్దేరివెళ్లింది.

