Thu Mar 19 2026 04:51:59 GMT+0530 (India Standard Time)
Telangana : హైదరాబాదీలకు నేటి నుంచి గుడ్ న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి కార్గో సేవలను హోం డెలివరీ ప్రారంభించనుంది

హైదరాబాద్ నగర వాసులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరతో వస్తువులను మీ ఇంటి వద్దకు చేరే వేసే విధానాన్ని నేటి నుంచి అమలులోకి తేనుంది. టీజీ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా కార్గో సేవలను ప్రారంభిస్తుంది. ముందుగా ఇంటివద్దకు కార్గో సేవలను అందించేందుకు ఈ సేవలను హైదరాబాద్ నగరంలో ప్రారంభించనుంది. హైదరాబాద్ నగరంలో పైలెట్ ప్రాజెక్టుగా పార్శిళ్లను హోం డెలివరీ నేట ినుంచి ఇవ్వనుంది.
పార్శిళ్ల హోం డెలివరీ...
ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం. ఇక పార్శిళ్లు కూడా సేఫ్ గా ఇంటివద్దకు చేరతాయి. తక్కువ ఖర్చుతో ఇంటివద్దకే కార్గో సేవలను ఎక్కువ మంది వినియోగిస్తారని టీజీఎస్ ఆర్టీసీ భావిస్తుంది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా డోర్ డెలివరీని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ సేవలను తొలుత భాగ్య నగర్ వాసులకు అందించనున్నామని ఆయన చెప్పారు. నేటి నుంచే పార్శిళ్ల హోం డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.
Next Story

