Thu Mar 19 2026 05:48:58 GMT+0530 (India Standard Time)
నేడు ఎన్టీఆర్ జయంతి...ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సినిమా రంగంలో ఆయన నటించిన సినిమాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు.
రాజకీయ రంగంలో...
ఎన్టీఆర్ కేవలం సినిమా రంగంలోనే కాకుండా కాకుండా రాజకీయ రంగంలోనూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలతో తెలుగు ప్రజల ఇళ్లల్లో వెలుగులు నిండాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శమని, వాటిని ఆచరించాలని కొనియాడారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంద్రీశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
Next Story

