Thu Jan 29 2026 03:04:05 GMT+0000 (Coordinated Universal Time)
ఓజీ పై మరోసారి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు ఓజీ మూవీ టిక్కెట్ ధరలపై మరోసారి తీర్పు చెప్పింది.

తెలంగాణ హైకోర్టు ఓజీ మూవీ టిక్కెట్ ధరలపై మరోసారి తీర్పు చెప్పింది. ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ కోసం టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఓజీ యూనిట్ సింగిల్ బెంచ్ ను తీర్పును సవాల్ చేస్తూ తిరిగి హైకోర్టును ఆశ్రయించింది.
టిక్కెట్ ధరలను పెంచడానికి వీల్లేదని...
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కూడా సమర్ధించింది. టిక్కెట్ ధరలను ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓజీ యూనిట్ తరుపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం ఓజీ టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి వీల్లేదని తెలిపింది. విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

