Wed Mar 26 2025 08:02:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఇక రియల్ రంగానికి పరుగులే... ఒకే ఒక నిర్ణయంతో
హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వీటిని చేర్చడం ద్వారా కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలోకి 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఏర్పడినట్లయింది.
హెచ్ఎండీఏ పరిధిలో....
దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశాలున్నాయి. మాస్టర్ ప్లాన్ కూడా మారబోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరం మరింత విస్తరించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Next Story