Sun Mar 22 2026 02:12:36 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక ‘కామన్ బిల్’ అమలు చేయాలని నిర్ణయించింది

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక ‘కామన్ బిల్’ అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్ పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనివల్ల స్థానిక సంస్థల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రజలపై భారం కూడా తగ్గుతుందని భావిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలపై భారం పడకుండానే...
ప్రజలపై భారం పడకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, మొదట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ముంబై, బెంగళూరు నగరాల తరహాలోనే నీటి బిల్లు, కరెంట్ బిల్లు, ఆస్తి పన్నులకు సంబంధించి 'కామన్ బిల్'ను తీసుకురావాలని బల్దియా నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేశారు. త్వరలోనే హైదరాబాద్ లో దీనిని అమలు చేయనున్నారు.
Next Story

