Sat Mar 15 2025 13:35:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మద్యం ప్రియులు నోరు కట్టేసు కోవాల్సిందే .. తెలంగాణలో షాపులు బంద్
తెలంగాణ మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక రోజు మద్యం దుకాణాలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది

తెలంగాణ మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక రోజు మద్యం దుకాణాలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీన హోలీ సందర్బంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హోలీ సందర్భంగా ...
ఈ నెల 14వ తేదీ హోలీ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఒకరోజు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్ హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మద్యం విక్రయాలు బంద్ అవుతాయి. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
Next Story