Hyderabad : సంక్రాంతికి వెళ్లే వారికి సర్కార్ గుడ్ న్యూస్.. ఇక టోల్ ఫీజు చెల్లించకుండానే?
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతికివెళ్లేవారికి టోల్ ఫీజుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని టోల్ గేట్ల నుంచి ఈ వెసులు బాటు కల్పించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకనే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయాలని ఇప్పటికే నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కరీనంగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లే వారిందరికీ ఈ వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఎన్ని రోజులు ఈ టోల్ ఫ్రీ ని అమలు చేయాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.

