Fri Dec 05 2025 22:44:30 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ఖైరతాబాద్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ కు చేరుకుంటారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు వినాయక నిమజ్జనం ఉండటంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలను కమిటీ నిలిపి వేసింది.
ఉపాధ్యాయ దినోత్సవంలో....
అలాగే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఇచ్చే అవార్డు ప్రదానం చేయనున్నారు. పాఠశాల శాఖలో మొత్తం నలభై తొమ్మది మంది టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులను ఉద్దేశించి హాజరై ప్రసంగించనున్నారు.
Next Story

