Fri Dec 19 2025 18:39:35 GMT+0000 (Coordinated Universal Time)
మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన రేవంత్
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిచారు

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిచారు. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరింత మెరుగవుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ లో జరిగిన ఒప్పందాలతో మరికొన్ని ముఖ్యమైన సంస్థలు ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు.
ఉపాధి అవకాశాలు...
తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ లో పెట్టుబడులు రావడానికి కారణం హైదరాబాద్ లో ఉన్న సానుకూలమైన వాతావరణమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రజాప్రతినిధులు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Next Story

