Sat Dec 06 2025 07:28:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : హైదరాబాద్ కు రేవంత్ వరాలు.. రేపు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వరాలు ప్రకటించారు. రేపు హైదరాబాద్ కు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వరాలు ప్రకటించారు. రేపు హైదరాబాద్ కు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మంచినీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి నీటి తరలింపు పథకాన్ని ఆయన ప్రారంభించానున్నారు. కీలకమైన మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు జరపనున్నారు.
తాగునీటి పథకానికి...
8,858 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. గోదావరి డ్రికింగ్ వాటర్ ఫేజ్ 1 పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మల్లన్న సాగర్ జలాశయం నుంచి ఇరవై టీఎంసీలను తరలించే కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
తాగునీరు అందించేందుకు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థను బలపరచడానికి, వేగంగా విస్తరిస్తున్న నగర పరిసర ప్రాంతాల అవసరాలను తీర్చడానికితాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 7,360 కోట్ల గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ (ఫేజ్-II & III) కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీరు అందించనున్నారు. ఇందులో 2.5 టీఎంసీల నీరును ఓస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ద్వారా మూసీ నదీ పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలను తీర్చనున్నాయి. ఈ మార్గంలో ఉన్న ఏడు మధ్యవర్తి చెరువులు కూడా నింపుతారు. ప్రాజెక్ట్ను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపడుతున్నారు. దీన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు.
Next Story

