Wed Dec 17 2025 08:50:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాశమైలారానికి ఎన్డీఎంఏ బృందం
నేడు పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది.

నేడు పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది. పేలుడుకు సంబంధించి కారణాలపై ఎన్డీఎంఏ బృందం అధ్యయనం చేయనుంది. నేడు ఉదయం ఎస్డీఎంఏ అధికారులతో కలసి షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం కలిసి పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించనుంది.
ప్రమాదంపై నివేదిక...
జూన్ నెల 30వ తేదీన సిగాచీ రసాయన పరిశ్రమ మైదానంలో ప్రమాదం జరిగి నలభై మూడు మంది మరణించిన నేపథ్యంలో షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం పర్యటించనుంది. పేలుడు జరగడానికి గల కారణాలను విశ్లేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదిక అందించనుంది. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా సూచించనుంది. దీంతో ఈ ప్రమాదానికి గల వాస్తవ కారణాలు ఏమయి ఉంటాయన్న ఉత్కంఠకు తెరపడే అవకాశముంది.
Next Story

