Fri Dec 05 2025 23:22:12 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు.. కానీ ఇంతలోనే?
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తారకరత్న చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తారకరత్న చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న చనిపోయారన్నారు. 27న యువగళం పాదయాత్ర సందర్భంగా గుండెపోటు వచ్చిన వెంటనే ట్రీట్ మెంట్ ఇచ్చి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించామని తెలిపారు. ఈ నెల 22వ తేదీన 40 వయసులోకి అడుగుపెట్టాల్సిన తరుణంలో తారకరత్న చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.
భవిష్యత్ ఉన్న...
మంచి భవిష్యత్ ఉన్న యువకుడు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను కూడా తారకరత్న వ్యక్తం చేశారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. కుటుంబం మొత్తం షాక్ లో ఉన్నామని చంద్రబాబు అన్నారు. కోలుకుని తిరిగి వస్తారని అందరం ఆకాంక్షించామని తెలిపారు. కానీ భగవతుండు కరుణించలేదన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తారకరత్న కుటుంబానికి తామంతా అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు.
Next Story

