Sun Mar 08 2026 12:11:55 GMT+0530 (India Standard Time)
అస్వస్థతకు గురైన తారకరత్న భార్య
తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. తారకరత్న మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తారకరత్న భార్య అలసి పోయారు. దాదాపు 23 రోజుల నుంచి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నాటి నుంచి ఆమె ఆందోళనగానే ఉన్నారు. ఆమె మానసిక వత్తిడికి లోనయిట్లు తెలిపారు.
భర్త మరణాన్ని...
నిన్న చనిపోయిన తర్వాత ఆమె మంచినీళ్లు కూడా ముట్టుకోపోవడం, ఎంత ఓదార్చినా ఆమె బాధను దిగమింగుకోలేక అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా అలేఖ్యా రెడ్డి తారకరత్నను తలచుకుంటూ కుమిలిపోయి అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
Next Story

