Sun Mar 08 2026 14:04:13 GMT+0530 (India Standard Time)
తారకరత్న భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు
తారకరత్న భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. మరికాసేపట్లో తారకరత్న పార్ధీవదేహాన్ని ఫిలింఛాంబర్ కు తీసుకెళతారు

తారకరత్న భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. మరికాసేపట్లో తారకరత్న పార్ధీవదేహాన్ని ఫిలింఛాంబర్ కు తీసుకెళతారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం సాయంత్రం మూడు గంటల వరకూ ఉంచుతారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
సాయంత్రం...
నందమూరి బాలకృష్ణ నిర్ణయించిన ప్రకారం ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తారకరత్నకు ఆయన ఇంటి వద్ద నివాళులర్పించారు. శనివారం బెంగుళూరు నారాయణ హృదయాలయలో మరణించిన తారకరత్నను చివరిసారిగా చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు.
Next Story

