Fri Dec 05 2025 15:24:09 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో కర్ఫ్యూ వాతావరణం
తెలంగాణలో ఎండలు అదిరిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది

తెలంగాణలో ఎండలు అదిరిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రచండ భానుడిని తట్టుకోలేక ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడి పోతున్నారు. ఎండ వేడిమికి బయటకు రాకపోవడంతో హైదరాబాద్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయింది. ఉదయం పది గంటల నుంచే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరిగి...
వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో వడగాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఇళ్లలో నుంచి బయటకు రాకపోతేనే మంచిదని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటం, ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Next Story

