Thu Mar 19 2026 05:27:26 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ మళ్లింపు
శ్రీరామనవమి సందర్భంగా నేడు శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. పురాణంశాల నుంచి రాంలీలా మైదానం వరకూ ఈ యాత్ర సాగనుంది

శ్రీరామనవమి సందర్భంగా నేడు శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. పురాణంశాల నుంచి రాంలీలా మైదానం వరకూ ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్ర ఆరు కిలోమీటర్ల మేర సాగనుంది. ఆరు కిలోమీటర్ల శోభాయాత్ర సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగనుంది.
ఆరు కిలోమీటర్లు...
మొత్తం ఆరు కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కదలికలపై ఒక కన్నేసి పోలీసులు ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం కావడంతో ముస్లింల ప్రార్థనలకు ఆటంకం కలిగించకుండా ఈ యాత్రను నిర్వహించుకోవాలని ఇప్పటికే నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
Next Story

