Sat Dec 13 2025 22:35:51 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఇరవై బోగీలు ఏర్పాటు చేయనుంది. బుధవారం నుంచి సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు వంద బోగీలతో వెళ్లనుంది. ప్రస్తుతం రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, పథ్నాలుగు ఏసీ ఛైర్ కార్లతో మొత్తం పదహారు బోగీలతో వందేభారత్ రైలు నడుస్తుంది.
312 సీట్లు అదనంగా...
అయితే రేపటి నుంచి అదనంగా మరో నాలుగు బోగీలు రానున్నాయి. నాలుగు ఏసీ చైయిర్ కార్లను శాశ్వతంగా జత చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే నరి్ణయంతో తిరుపతికి వెళ్లే వందేభార్ రైలులో అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వందేభారత్ రైలు ఆగే స్టేషన్ల విషయంలో మాత్రం మార్పు ఉండదు.
Next Story

