Thu Mar 19 2026 04:41:45 GMT+0530 (India Standard Time)
Trains : ప్రధాన రైళ్ల సమయంలో మార్పు.. నేటి నుంచే
దక్షిణ మధ్యరైల్వే శాఖ ప్రధాన రైళ్ల సమయాలలో మార్పులు చేసింది. నేటినుంచే మార్చిన వేళలు అమలులోకి రానున్నాయి

దక్షిణ మధ్యరైల్వే శాఖ ప్రధాన రైళ్ల సమయాలలో మార్పులు చేసింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఈ రైళ్ల వేళను మార్చింది. ప్రయాణికులు ఇది గమనించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కోరుతున్నారు. నారాయణాద్రి, పద్మావతి, సింహపురి వేళల్లో మార్పులు చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి నుంచే అమలు...
హైదరాబాద్లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరే ఈ మూడు ప్రధాన రైళ్ల వేళల్లో మార్పులు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ ఇకపై ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.05 గంటలకు, లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరతాయని వెల్లడించారు. మారిన రైళ్ల వేళలు ఆదివారం నుంచి వర్తించనున్నాయని పేర్కొన్నారు.
Next Story

