Fri Dec 05 2025 08:12:33 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు హైదరాబాద్ లో సంఘీభావ ర్యాలీ
భారత సైన్యానికి మద్దతుగా నేడు హైదరాబాద్ లో సంఘీభావ ర్యాలీ జరగనుంది.

భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ జరగనుంది. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకూ ఈ శాంతి ర్యాలీని నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పహాల్గామ్ లో ఉగ్రవాదులు జరిగిన దాడులకు ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
సైనికులకు మద్దతుగా...
ఈ ర్యాలీ భారత సైనికుల్లో ఆత్మస్థయిర్యాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడుతుందని, రాజకీయాలకు అతీతంగా భారత్ సైన్యానికి మద్దతును ప్రకటించాలని ముఖ్యమంత్రి కోరారు. అందుకే ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పక్షాల నేతలు పాల్గొని భారత సైనికులకు సంఘీభావం తెలపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Next Story

