Sat Dec 13 2025 19:29:32 GMT+0000 (Coordinated Universal Time)
రెండు గంటలు విజయ్ దేవరకొండ విచారణ
బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ ను సిట్ అధికారులు విచారించారు

బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ ను సిట్ అధికారులు విచారించారు. బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన విజయ్ దేవరకొండను సీఐడీ సిట్ అదికారులు రెండు గంటల సేపు విచారించారు. బెట్టింగ్ యాప్ ల నుంచి ఈ ప్రచారం కోసం విజయ్ ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్లు ఎంత ముట్ట చెప్పారు? అనే అంశాలపై విచారణ జరిపినట్లు తెలిసింది.
బెట్టింగ్ యాప్స్ ద్వారా...
బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్దయెత్తున సినీనటులు పారితోషికం తీసుకున్న దానిపై విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవర కొండతో పాటు ప్రకాశ్ రాజ్ కు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. గతంలో బెట్టింగ్ యాప్ లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడంతో దీనిపై సీఐడీ సిట్ కు ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండను విచారణకు పిలిపించారు. విజయ్ దేవరకొండ స్టేటెమెంట్ ను రికార్డు చేశారు.
Next Story

