Tue Feb 07 2023 16:03:14 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మవారికి బోనం సమర్పించుకున్న పీవీ సింధు
అమ్మవారికి బోనాలు సమర్మించేదుకు భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో

పాతబస్తి లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని.. ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. మహంకాళికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
అమ్మవారికి బోనాలు సమర్మించేదుకు భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి లైన్లలో వేచి ఉన్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి, ఇతర ఆలయాల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Next Story