Wed Mar 18 2026 19:29:10 GMT+0530 (India Standard Time)
ప్రారంభమైన శోభాయత్ర
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర జరుగుతుంది

నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర జరుగుతుంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం పది వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించినట్లు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శోభాయాత్ర వెళ్లే మార్గంలో కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
దారిపొడువునా...
హనుమాన్ శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో 1500 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు. ఉదయం 11 గంటలకు గౌలిగూడ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర రాత్రి 8గంటలకు జరుగుతుంది. తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వద్ద శోభాయాత్ర ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Next Story

