Thu Apr 02 2026 11:53:40 GMT+0530 (India Standard Time)
Hyderabad : నేడు శోభాయాత్ర..ట్రాఫిక్ ఆంక్షలు అమలు
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది

నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ఆంక్షలను పోలీసులు విధించారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ ఆలయం వరకు శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గౌలిగూడ నుంచి...
హనుమాన్ శోభాయాత్ర ఉదయం 11:30 గంటలకు ప్రారంభంకానుంది. గౌలిగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర తాడిబండ్ ఆలయానికి చేరుకునే సరికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు రూట్లలో భారీ వాహనాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.
Next Story

