Fri Jan 23 2026 13:48:31 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళుతున్నారా? అయితే మీ పార్కింగ్ ఎక్కడంటే?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలంటే మార్పులు గమనించాల్సి ఉంది

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలంటే మార్పులు గమనించాల్సి ఉంది. పార్కింగ్ ప్లేస్‌లు మారాయి. సికింద్రాబాద్ కు సొంత వాహనాలపై వెళుతున్న ప్రయాణికులు వారికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ అధికారులు కొన్ని సూచనలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రయాణికులకు పార్కింగ్ స్థలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సౌకర్యాలు మెరుగుపరచడం కోసం, రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాలను మరింతగా పెంచడం కోసం దాదాపు 714.73 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు...
ఈ పనుల్లో భాగంగా, స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సజావుగా సాగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. కేవలం పికప్ , డ్రాప్ లను మాత్రమే అనుమతించనున్నారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 వైపు వెళ్లేవారు అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఈ జోన్లోకి ప్రవేశించే ప్రయాణికులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్, డ్రాప్ సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత పార్కింగ్ స్థలంలో పార్క్ చేయని వాహనాలపై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
పార్కింగ్ ఛార్జీలు ఇలా...
రైళ్లు ఎక్కడానికి, ప్రయాణికుల రాకపోకలకోసం, పార్కింగ్ ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్ నెంబరు పది వైపున ఉన్న బేస్మెంట్లో వాహనాలకు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబరు పది బేస్మెంట్ లో ఉన్న అనుమతించి పార్కింగ్ స్థలాల కోసం ఆమోదించబడిన పార్కింగ్ ఛార్జీలు ఈ విధంగా నిర్ణయించారు. పార్కింగ్ ఛార్జీల కింది ఫోర్ వీలర్ కు తొలి రెండు గంటల లోపు నలభై రూపాయలు మరో గంట అంతకంటే తక్కువ సమయం ఉంటే అదనంగా ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనం మొదటి రెండు గంటలు లేదా అంతకు లోపల ఉంటే ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తారు. ఆ తర్వాత మరో గంట ఉంటే మరో పది రూపాయలుఅదనంగా వసూలు చేస్తారు.
Next Story

