Mon Mar 16 2026 21:47:38 GMT+0530 (India Standard Time)
మోదీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారయింది. నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన హైదరాబాద్ రానున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారయింది. నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన హైదరాబాద్ రానున్నారు. 8 ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌కు మోదీ చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి వెళ్తారు. నరేంద్ర మోదీ11.30గంటకు నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
శంకుస్థాపనలు...
ఉదయం 11.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. పన్నెండు గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ నుంచి 1.20 వరకూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట నుంచి నరేంద్ర మోదీ తిరిగి బయలుదేరి వెళతారు.
Next Story

