Wed Jan 21 2026 22:23:39 GMT+0000 (Coordinated Universal Time)
సేవ్ ఫిల్మ్ ఛాంబర్.. బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ
హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తులు, స్థలం దుర్వినియోగం అవుతున్నాయని పలువురు సినీ ప్రముఖులు నిరసనకు దిగారు

హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తులు, స్థలం దుర్వినియోగం అవుతున్నాయని పలువురు సినీ ప్రముఖులు నిరసనకు దిగారు. 'సేవ్ ఫిల్మ్ ఛాంబర్, బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిర్మాతలు, నటులు, తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ స్థలం పరిశ్రమ అవసరాలకే ఉపయోగించాలని వారంతా డిమాండ్ చేశారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చినందుకు గాను ఫిల్మ్ నగర్ సొసైటీలో ఈ ఛాంబర్‌ను కేటాయించారని, ఇది కట్టి దాదాపు 40 ఏళ్లు దాటిందని నిరసన తెలియజేస్తున్న ప్రముఖులు అన్నారు. ఈ స్థలాన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవసరాలకు తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
Next Story

