Fri Dec 05 2025 17:48:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవం
దీపావళి తర్వాతి రోజు యాదవులు సదర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు

దీపావళి తర్వాతి రోజు యాదవులు సదర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాలు ఈ వేడుకలతో కళకళలాడాయి. కర్రలు పట్టుకుని బృందాలుగా చేరిన యువకులు, ఉత్సాహభరితమైన డప్పుల మోతకు నృత్యం చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన ఎద్దులను ముందుంచి ఊరేగింపులు నిర్వహించారు. కొందరు యువకులు ఎద్దుపైనే నిలబడి నృత్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
సదర్ సందర్భంగా
సదర్ సందర్భంగా ఎద్దుకు పూజ చేసి ఇంట్లోకి అనుమతించడం శుభమని యాదవులు నమ్ముతారు. సైదాబాద్, మల్కాజిగిరి, ఈస్ట్ మారేడ్ పల్లి, పంజాగుట్ట, బోయిన్పల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి నారాయణగూడలో భారీ సమ్మేళనంతో వేడుకలు ముగియనున్నాయి. అక్కడ పాతబస్తీ, చప్పల్బజార్, అమీర్పేట్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన విభిన్న రకాల ఎద్దులను ప్రదర్శిస్తారు.
Next Story

