Thu Jan 29 2026 02:40:33 GMT+0000 (Coordinated Universal Time)
పది స్కూల్ బస్సులు సీజ్
రాజేంద్రనగర్ లో ఆర్టీవో అధికారులు తనిఖీలు చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూలు బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

రాజేంద్రనగర్ లో ఆర్టీవో అధికారులు తనిఖీలు చేవఆరు. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూలు బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలను పాటించని పది బస్సులను సీజ్ చేశారు. తెలంగాణాలో పాఠశాలలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సులను తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఫిట్ నెస్ లేని.....
ఇందులో పది బస్సులు సీజ్ చేశారు. ఫిట్ నెస్ లేని బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది పాఠశాలల ప్రారంభంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి ఎటువంటి ప్రమాదం జరగకుండా స్కూల్ బస్సులను తనిఖీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Next Story

