Wed Apr 08 2026 11:14:13 GMT+0530 (India Standard Time)
Road Accident : మద్యం తాగి.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడుగా?
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారును ర్యాష్ డ్రైవంగ్ చేసి ఇద్దరు ప్రాణాలను బలిగొన్నారు. మద్యం పూటుగా తాగి కారులో వస్తూ బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన ఇద్దరు మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కారు ఢీకొట్టిన తర్వాత దాదాపు వంద మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లింది.
ఇద్దరు వ్యక్తులు మృతి...
ఈ ప్రమాదంలో నడిచి వెళుతున్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమయిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

