Wed Mar 25 2026 13:41:05 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ పెట్రోలు, గ్యాస్ కొరతపై సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. గుంటూరు జిల్లాలో వివాహవేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
సిలిండర్ల కొరతపైన కూడా...
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు పెట్రోలు బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్దయెత్తున క్యూ కడుతున్నారు. దీంతో తెలంగాణలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ నిల్వలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి వివిధ పెట్రోలియం శాఖలకు చెందిన అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు.
Next Story

