Wed Mar 18 2026 09:34:24 GMT+0530 (India Standard Time)
బాలుడి మృతిపై సీరియస్ గా రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి తనను కలచివేసిందన్నారు. వీధి కుక్కల దాడిలో మరెవ్వరూ గాయపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
టోల్ ఫ్రీ నెంబరును...
వీధి కుక్కల విషయంపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలను తరలించేందుకు బ్లూక్రాస్, పశువైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ఆసుపత్రుల్లో కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్స అందించేలా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Next Story

